మానవతా సంస్థ ఆధ్వర్యంలో అందాల పోటీలు విజేత రీమాకు సన్మానం
పయనించే సూర్యుడు డిసెంబర్13 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
మానవతా టి సుండుపల్లి వారి ఆధ్వర్యంలో ఇటీవల జైపూర్ లో జరిగినటువంటి మిస్ ఈకో ఇంటర్నేషనల్ ఇండియా 2025 అందాల పోటీల్లో విజేతగా నిలిచినటువంటి సుండుపల్లికి చెందిన జాహుద్ భాషా యొక్క కుమార్తె చిరంజీవి రీమ ను మానవతా టి సుండుపల్లె సభ్యులు కలిసి అభినందనలు తెలియజేసి చిరు సత్కారం చేయడం జరిగింది . అలాగే త్వరలో లండన్ లో జరగబోయే పోటీలలో కూడా విజేతగా నిలవాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మానవతా సుండుపల్లె అధ్యక్షులు లక్ష్మయ్య నాయుడు గారు సెక్రెటరీ అమృనాయక్ ఆర్థిక కార్యదర్శి నరసింహ ఉమ్మడి కడప జిల్లా ఆర్థిక కార్యదర్శి హరికుమార్ మండల కన్వీనర్ కృష్ణంరాజు కో చైర్మన్ నాగేశ్వర సీనియర్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి మహబూబ్ బాషా సుబ్రహ్మణ్యం శ్రీహరి నాయుడు మరియు మణికంఠ పాల్గొన్నారు