ఇంద్రనగర్ పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పాయం లలిత గెలుపుకై విస్తృత ప్రచారం
పయనించే సూర్యుడు ఆగస్టు 15 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: సోమవారం శాసనసభ్యులుకోరం కనకయ్య ఆదేశాల మేరకుసిపిఐ పార్టీ బలపరిచిన ఇంద్రానగర్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి పాయం లలిత మరియు వార్డు మెంబర్లను గెలిపించాలని మాజీ వైస్ ఎంపీపీ మండల రామువిస్తృత ప్రచారం చేసి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల రాము గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గిరిజన తండాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, సన్న వడ్లకు బోనస్ తో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఇల్లందు మండలంలో మెజార్టీ గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.ఎండ్ న్యూస్