వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మానాలా గ్రామ మరియు వివిధ తండల నుండి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మెంబర్లు.
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 🐊హామీల అమలులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది
రెండేండ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయక ప్రజలను మోసం చేసింది
మానాలా ను స్ఫూర్తిగా తీసుకొని బాల్కొండ నియోజకవర్గం లోని 3 విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కాంగ్రెస్ నాయకులైతే గ్యారంటీ కార్డులు తీసుకుని ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగారో ఇప్పుడు అదే నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయమని మళ్లీ మీ ఇంటికి వస్తున్నారు మహిళలకు ఇస్తానన్న నెలకు 2500, 2000 నుండి 4 వేలకు పెంచుతానన్న ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15000 రైతు భరోసా, వడ్లకు 500 బోనస్, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, మొదటి సంవత్సరం లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇలా అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నాయకులు సక్రమంగ అమలు చేయలేదుఇప్పుడు మళ్లీ అదే నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్నారు . కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వారు చేసిన మోసాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు బుద్ది చెప్పాలని నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో అధికారంలో మేమే ఉన్నాం మాకు ఓటు వేయకుంటే మీ గ్రామ పంచాయతీ లకు నిధులు రావు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి 14th ఫైనాన్స్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం నుండి 15th ఫైనాన్స్ ద్వారా డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ లకి నిధులు వస్తాయి.ఏ పార్టీ సర్పంచ్ అయినా వాటిని ఆపడానికి ఎవరికి అధికారం ఉండదు. దయచేసి ప్రజలు దీనిని గమనించాలి. కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో తిరుగుతూ మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ప్రశ్నిస్తున్నాను మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుంది ఈ రెండేళ్లలో ఆయా గ్రామాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి ? రెండేళ్లలో కనీసం ఒక్క అభివృద్ధి పని అయిన చేసారా? కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేస్తామని చెబుతూ ఈ ఎన్నికల కోసం కుల సంఘ సభ్యులను మభ్య పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది గడిచిన రెండేండ్లలో మీరెన్ని కుల సంఘ భవనాలు నియోజకవర్గంలో కట్టించారు?గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గంలో వందలాది కుల సంఘ భవనాలను మేము కట్టించాం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంజూరైన అనేక కుల సంఘ భవనాలను ఈ ప్రభుత్వం రాగానే వాటికి క్యాన్సల్ చేసింది నేను అనేక సందర్భాల్లో ఇప్పటికే మంజూరైనా వాటిని క్యాన్సిల్ చేయకండి అని ఈ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరిన అడిగినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి మా హయాంలో కట్టి పూర్తి అయినా కులసంఘాలకు బిల్లులు కుడా ఇవ్వడం లేదు. ఇప్పుడు వచ్చి కులసంఘ భవనాలు ఇస్తాం అని సర్పంచ్ ఎన్నికల కోసం మాత్రమే ప్రజలను కాంగ్రెస్ నాయకులు మభ్యపెడుతున్నారు. కావున కాంగ్రేస్ పార్టీ అబద్దపు ప్రచారాలు మళ్ళీ ఒక్కసారి నమ్మి మరొక్కసారి మోసపోవద్దు అని నా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
మానాల గ్రామంలో మరియు దేగవతాండాలో అక్కడి ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి BRS పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి స్ఫూర్తిని బాల్కొండ నియోజకవర్గంలోని మిగతా గ్రామ ప్రజలు కూడా చూపెట్టాలని, టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారస్తూ విజ్ఞప్తి చేశారు