మధురలో బస్సులు దగ్ధం: మృతుల సంఖ్య 13కి చేరింది
పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్ మధురలో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే 127వ మైలురాయి వద్ద ఒక్కసారిగా ఏడు బస్సులు, 3 కార్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య 13కు చేరింది. కాగా, ఇందులో మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులు, కార్లు కొన్ని నిమిషాల్లోనే కాలిపోయాయి. అయితే మొదట బస్సులోని నలుగురు ప్రయాణికులు మరణించిన ధృవీకరించిన అధికారులు.. అనంతరం మృతుల సంఖ్య ఇంకా పెరిగిందని తెలిపారు.ఇవాళ తెల్లవారుజామున యూపీలోని మధురలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర ప్రమాదం జరిగి 13 మంది సజీవదహనం కాగా.. 35 మందికి గాయాలయ్యాయి. మరికొందరు ప్రమాదాన్ని గమనించి వెంటనే అప్రమత్తమై వాహనాల నుంచి బయటకు దూకడంతో తమ ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికి పోలీసులు, జిల్లా యంత్రాంగంతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది.ఢిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌లోని ఆగ్రా-నోయిడా లేన్‌లో ఈ ఘటన జరిగింది. ఆగ్రా- నొయిడా లేన్‌లోని 127వ మైలురాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముందుగా 3 కార్లు ఢీకొనగా.. అనంతరం వాటిని 7 బస్సులు వాటిని ఢీకొన్నాయి. ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి రోడ్‌వేస్ బస్సు కాగా.. మిగిలిన ఆరు స్లీపర్ బస్సులు.. ఈ ప్రమాదంలో చెలరేగిన మంటలను 11 ఫైర్ ఇంజిన్లు సహాయంతో అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే అన్ని బస్సులు మంటల్లో కాలిపోయాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని’ మధుర రూరల్ ఎస్పీ సురేష్ చంద్ర రావత్ వెల్లడించారు.