PS Telugu News
Epaper

అవతార్ 3తో పాటు రామాయణం 3డీ ప్రోమో.. మాస్టర్ ప్లాన్!

📅 16 Dec 2025 ⏱️ 3:56 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ : ఇండియన్ సినీ ఇండ‌స్ట్రీ ఇప్పుడు హాలీవుడ్‌తో పోటీ ప‌డే దిశ‌గా అడుగులు వేస్తోంది. మ‌న ప్రేక్ష‌కుల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌న మూవీస్‌ను చూసి ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌టానికి సిద్ద‌మ‌వుతున్నారు నితీష్ తివారి. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఇందులో రాముడిగా ర‌ణ్‌భీర్ క‌పూర్‌, సీత‌గా సాయి ప‌ల్ల‌వి, రావ‌ణాసురుడిగా య‌ష్ న‌టిస్తున్నారు. వీరితో పాటు చాలా మంది న‌టీన‌టులు ప్రేక్షకుల‌ను మెప్పించ‌బోతున్నారు. కాగా.. రామాయ‌ణ్‌ను త్రీడీలో రూపొందిస్తున్నారు. అది కూడా రెండు భాగాలుగా, అందులో మొదటి భాగం వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి రిలీజ్ కానుంది.‘రామాయ‌ణ’ మూవీకి గ్లోబ‌ల్ రేంజ్‌లో క్రేజ్ పెంచ‌టానికి మేక‌ర్స్ మాస్ట‌ర్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఈ మూవీ త్రీడీ ప్రోమోను అవ‌తార్ 3 (అవ‌తార్ యాష్ అండ్ ఫైర్‌) సినిమాలో ప్లే చేయ‌బోతున్నారు. ఇలాంటి చిత్రానికి సంబంధించిన ప్రోమోను అవ‌తార్ వంటి సినిమాలో ప్ర‌ద‌ర్శించాల‌నుకోవ‌టం మామూలు విష‌య‌మైతే కాదు. మ‌రి రామాయ‌ణ త్రీడీ ప్రోమో విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించ‌నుందో తెలియాలంటే డిసెంబ‌ర్ 19 వ‌ర‌కు ఆగాల్సిందే.ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాను రూపొందించని విధంగా నాలుగువేల కోట్ల రూపాయ‌ల‌తో రామాయ‌ణ‌ను రూపొందిస్తున్నారు. రామాయ‌ణ రెండో భాగంను 2027లో విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా కోసం యావ‌త్ సినీ ప్రపంచం ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోంది.

Scroll to Top