ఎస్సీ కాలనీ టెంపుల్ ప్రహరీ నిర్మాణం పనులు ప్రారంభం
పయనించే సూర్యుడు డిసెంబర్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ లో ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రహరీ నిర్మాణం పనులు ప్రారంబం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో తాళ్లూరి గిరినాయుడు సూచన మేరకు చేజర్ల మండల కేంద్రలో ఎస్సీ కాలనీ లో గల శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రహరీ నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది.ఈ టెంపుల్ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుండి 500000 రూ మంజూరు చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ ఎస్సీ సెల్ నాయకులు సోమవరపు హజరత్తయ్య కాలనీ . ఆత్మకూరు సుబ్బరాయుడు, నిప్పట్లపల్లి అంకయ్య, ఆత్మకూరు రవికుమార్, కలువాయి పెంచలయ్య, ఆత్మకూరు పుల్లయ్య, గ్రామ ప్రజలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు
