కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దాం
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్(ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ పిలుపు
కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ పిలుపును ఇచ్చారు అమరుడు పిట్ల. ఎల్లన్న స్వగ్రామం అయినా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం నాడు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ, వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ మాట్లాడుతు: అతివాదం తలకెక్కిన పీపుల్ సార్ ఆనాడు పిరికితనంతో దొంగ చాటుగా నిరాయుధుడు అయినా పిట్ల. ఎల్లన్నను కాల్చి చంపారన్నారు. ప్రపంచ చరిత్రలో ప్రజలు లేని విప్లవాలు ఇక్కడ విజయవంతం కాలేవన్నారు. కొంతమంది సాయిదులతో విప్లవోద్యమాలు పురోగతి చెందు లేవని ఇది చరిత్ర చెప్పిన నిజమన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాయుధ పందా నుండి ప్రజాపంథాను మార్చుకుని విప్లవ ఉద్యమాలను నిర్మిస్తున్న ప్రజాపంథా రాజకీయాల వైపు అమరుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న బలంగా నిలబడ్డాడు అన్నారు. ఇది అవునన్నా కాదన్నా జనమెరిగిన సత్యం అన్నారు. ఇప్పటికైనా మారిన పరిస్థితి కనుగునంగా సిపిఐ (ఎంఎల్) మావోయిస్టు పార్టీలోని బలమైన వర్గం పంథాను మార్చుకుని ప్రజాపంథా రాజకీయాలకానుగుణంగా రావడం సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ (ప్రజాపంథా) విప్లవ రాజకీయాలే సరియైనవని స్పష్టమైనది అన్నారు. మిగతా సంస్థలు సైతం సరియైన రాజకీయాల వైపు నిలబడి విప్లవపార్టీల ఐక్యతను సాధించి దేశంలో విప్లవద్యమాల విజయవంతనికి పడుకోవాలని పిలుపునిచ్చారు. అమరుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తిని తీసుకొని బలమైన విప్లవోద్యమాలను నిర్మించాల్సిన బాధ్యత మన పైన ఉందని ఆయన గుర్తు చేశారు.కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్. రమేష్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, బి కిశోర్, ఎం సాయిరెడ్డి,ఎం అనిస్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఎస్ కిశోర్,ఎం నారగౌడ్,జె బాల్ రెడ్డి,జి కిరణ్,జి నర్సయ్య,పిట్ల చిన్న ఎల్లయ్య, జే రాజు, SK రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
