గొల్లపల్లిలో పశుగర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం
పయనించే సూర్యుడు డిసెంబర్ 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామము పంచాయతీలో బుధవారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించబడినది. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పశు వ్యాధులను సకాలంలోనే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని రైతులకు సలహాలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ . డి ఎల్ డి ఏ డా. డి. శ్రీనివాస రావు . ఉప సంచాలకులు, నెల్లూరు డివిజన్ డా.డి. నాగమణి , సహాయ సంచాలకులు ప్రాంతీయ పశువైద్యశాల కలువాయి డా.ఎస్. గురుజయంతి . చింతలాత్మకూరు పశువైద్యాధికారి డా.సి. హెచ్.కృష్ణమోహన్ . దాచూరు పశువైద్యాధికారి డా.యం.కృష్ణప్రసాద్ , చేజర్ల పశువైద్యాధికారి డా. పి.రాజేష్ , 24L సోమశిల కాలువ చైర్మన్ ఉడత .హాజరత్తయ్య , గ్రామ నాయకులు చిన్నయ్య , ఎం రమణయ్య. గొల్లపల్లి గ్రామ పాడిరైతులు తదితరులు పాల్గొన్నారు.
