రోడ్లు పైన పొంగి ప్రవహిస్తున్న మురుగనీరు
పయనించే సూర్యుడు డిసెంబర్ 17 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి చందన షాపింగ్ మాల్ వరకు డ్రైనేజ్ కాలవ బ్లాక్ అయింది గత నెల రోజులుగా ఈ డ్రైనేజీ నీళ్లు అక్కడే నిల్వ అయి భారీ దుర్వాస వస్తుంది అటు వెళ్లే ప్రజలకు దుర్వాసన భరించలేక ఉన్నారు అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు ఎవరూ కూడా ఈ డ్రైనేజీ నీ మెరుగు పరచలేదు ఆ రోడ్డులో వెళ్లే ప్రజలు తీవ్ర దుర్వాసనతో ముక్కు పట్టుకుని వెళ్ళవలసి వస్తుంది సూళ్లూరుపేట మున్సిపాలిటీలో సానిటరీ అధికారి ఉన్నాడో లేదో కూడా తెలియదు గత నెల రోజులుగా నిల్వ ఉంటే మున్సిపాలిటీ అధికారులు ఎందుకు క్లియర్ చేయట్లేదు మున్సిపల్ కమిషనర్ ఈ ప్రదేశాన్ని తనిఖీ చేసి నిల్వ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా తెలియజేశారు
