అపాచీ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం
పయనించే సూర్యుడు డిసెంబర్ 18 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
తడ మండలం మాంబటు లో ఉన్న అపాచీ కంపెనీ కార్మిక ల ప్రాణాలని గాలిలో దీపం లాగా చూసి చూడనట్లు కంపెనీ యాజమాన్యం చూస్తుంది మన కంపెనీ కోసం కష్టపడే కార్మికులని బాధ్యతగా చూసుకోవలసిన కర్తవ్యం కంపెనీ యాజమాన్యం మీద లేదా , ఏదో వస్తున్నారు మనకు పనిచేసి పెడుతున్నారు వాళ్లు ఎలా పోతే మనకెందుకులే అని నిర్లక్ష్యంగా చూస్తున్న యాజమాన్యం కంపెనీకి ఒక ఎంప్లాయ్ వస్తే తిరిగి ఇంటికి వెళ్ళే దాకా మనదే బాధ్యత అలాకాకుండా గాలిలో దీపం లాగా చూస్తే ఎంతవరకు న్యాయం కార్మికులు వెళ్లి వస్తున్న బస్సులు డ్రైవర్ సరిగా ఉన్నాడా లేడా బస్సు ఫిట్నెస్ గా ఉందా లేదా కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యం మీద ఉంద లేదా ఆటో తోలే డ్రైవర్ కి కారు తోలే డ్రైవర్ కి బస్సు ఇస్తే ఎలా ఉంటది డ్రైవర్ కి అనుభవం ఉందా లేదా చూడాలి అది చూడకుండా ట్రావెల్ వాళ్లకి మనం ఇన్ని బస్సులు ఇచ్చాం అది మాత్రమే చూసుకుంటే కార్మికులను చూసుకోవలసిన బాధ్యత మన మీద లేదా ఇలాగా వ్యవహరిస్తే ఎంతమంది ప్రాణాలు పోతాయో ఒకసారి ఆలోచించండి డ్రైవర్ నిర్లక్ష్యం ధోరణిలో కార్మిక ప్రాణాలు పోవాలా మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించండి అయ్యా ఆర్టీవో సూళ్లూరుపేట మండలంలో ఉన్నార లేర ఒక నెలకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో మీ కంటికి కనిపించట్లేదా హైవే మీద మీరు ఉన్నట్టా లేనట్టా ఉంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి మీకు తీరిక లేక మీకున్న డ్రైవర్లని కానిస్టేబుల్ ని రోడ్డుపైన ఉంచి వచ్చే పోయే బండ్ల దగ్గర పేపర్లు చెక్ చేసి పంపిస్తున్నారా లేక ఇంకేమైనా జరుగుతుందా . ప్రజలు కట్టే పన్నుల ద్వారా జీతం తీసుకుంటూ మనం బతుకుతున్నాం ఒకసారి అర్థం చేసుకోండి ఇకనైనా ప్రజలకి కొంచెం సాయపడండి ఈరోజు ఉదయం 7 గంటల 45 నిమిషాలకి బూదూరు నుండి అపాచీ కంపెనీకి కార్మికులతో వెళ్తున్న బస్సు కాదులూరు మలుపు దగ్గర రెండు బైకులు ఢీకొంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంపెనీ బస్సు డ్రైవర్ ఆ నిర్లక్ష్యానికి కార్మికు ల ప్రాణాల పోతే కార్మికుల కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి ఎవరు బాధ్యత? RTO లేదా కంపెనీ బాధ్యత వహిస్తుందా ఇకనైనా సంబంధిత అధికారులు ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా చర్యలు తీసుకోవాలి
