PS Telugu News
Epaper

బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా…

📅 18 Dec 2025 ⏱️ 6:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)

నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా ఏఐసిసి అగ్ర నాయకులు శ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్లను బీజేపీ ప్రభుత్వం వేదిస్తున్న సందర్భంలో ఈ రోజు కోర్ట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడి కేసులను తప్పుబట్టిన నేపథ్యంలో బీజేపీ అరాచకాలను నిలదీస్తూ ఏఐసిసి, పిసిసి, డీసీసీ ఆదేశాల మేరకు గురువారం రోజున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రేస్ అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి, నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ బొబ్బిలి రామకృష్ణ, బాన్స్వాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్, అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top