PS Telugu News
Epaper

ఒకే సారి 20 బి ఎస్ ఎన్ ఎల్ టవర్లు మంజూరు చేయించి చరిత్ర సృష్టించిన ఎంపీ డాకర్ బైరెడ్డి శబరి”

📅 18 Dec 2025 ⏱️ 6:29 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకే సారి 20 బి ఎస్ ఎన్ ఎల్ ( కేంద్ర ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ) సెల్ టవర్లు మంజూరు చేయించి చరిత్ర సృష్టించిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా ప్రజలచే శబాష్ అనిపించుకున్నారు.ఆవిష్కరణలకు నాయకత్వం వహించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను కమ్యూనికేషన్, అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ టెక్నాలజీలలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా నంద్యాల జిల్లా ప్రజల సెల్ ఫోన్ సిగ్నల్ వ్యవస్థను మెరుగు పరిచి వారి సమస్య పరిష్కరించాలని పార్లమెంట్ లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతి రాదిత్య సిందియాను కోరడంతో కేంద్ర కమ్యూనికేష్ శాఖ మంత్రి వెంటనే స్పందించి ఒకే సారి నంద్యాల జిల్లాకు 20 బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్లు ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు.నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం బనగానపల్లె మండలం చెర్లోకొత్తూరుకు 4జి కవరేజ్,
బనగానపల్లె మండలం, జ్వాలాపురంకు 4జి కవరేజ్, బనగానపల్లె మండలం నిలువుగొండ్లకు, 4జి కవరేజ్,
బనగానపల్లె మండలం, తమ్మడపల్లెకు, కల్లూరు మండలం, యాపర్లపాడుకు, కొత్తపల్లె మండలం, ఎర్రమఠంకు, మిడ్తూరు మండలం, దేవనూరు కు, 4జి కవరేజ్ టవర్లు, మిడ్తూరు మండలం, జలకనూరుకు, 4జి కవరేజ్, మిడ్తూరు మండలం, రోళ్లపాడుకు 4జి కవరేజ్, ఓర్వకల్లు మండలం, కేతవరంకు, 4జి కవరేజ్, ఓర్వకల్లు మండలం, కొమరోల్ కు 4జి కవరేజ్, ఓర్వకల్లు మండలం,ఎన్.కొంతలపాడుకు, 4జి కవరేజ్, అవుకు మండలం, సంగపట్నంకు 4జి కవరేజ్, మునిమడుగుకు 4 జీ కవరేజ్, నేరేడుచెర్లకు 4జి కవరేజ్, ఎస్ నల్లబల్లె, 4జి కవరేజ్, ఎస్. రంగాపురంకు, సంజామల మండలం, నట్ల కొత్తూరుకు 4జి కవరేజ్, ఉయ్యాలవాడ మండలం వెళ్దాం కు, వెలుగోడు మండలం, గట్టుతండాకు 4 జీ కవరేజ్ బి ఎస్ ఎన్ ఎల్ కొత్త టవర్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంజూరు చేయించి చరిత్ర తిరగ రాచారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అచంచలమైన నిబద్ధతను కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అనుచరించి మంజూరు చేసినందుకు, తన నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల సెల్ ఫోన్ సిగ్నల్ కష్టాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కృషి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి బి ఎస్ ఎన్ ఎల్ ( టెలికామ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ) సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్, పెరుమాళ్ళ విజయకుమార్, మధు, చిట్టిబోయిన శ్రీనివాసయాదవ్ లు ధన్యవాదములు తెలిపి, భారత దేశంలో ఒకే సారి, ఒక పార్లమెంట్ కు 20 బి ఎస్ ఎన్ ఎల్ టవర్లు మంజూరు కావడం, నంద్యాల పార్లమెంట్ చరిత్రలో ఒకే సారి 20 సెల్ టవర్లు మంజూరు చేయించడం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పని విధానంకు నిదర్శనం అన్నారు.

Scroll to Top