నంద్యాల పట్టణ కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్”
పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
గంజాయి అమ్ముతున్న వారి వద్ద నుండి 2.5 కే.జి ల గంజాయిని,మారుతి షిఫ్ట్ డిజైర్ కారును, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం.
నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి నంద్యాల ఎం.ఏఎస్పి జావళి ఆల్ఫోన్స్ ఐపీఎస్ . 17.12.2025 వ తేదీన మధ్యాహ్నము 01.00 గంటల కాలమపుడు నంద్యాల టౌన్ “వై ” జంక్షన్ కు సమీపములో ప్రథమ నంది దేవాలయం ఆర్చ్ వద్ద (ఏ1) షేక్ మునీర్ బాషా 34 సం. తండ్రి హుస్సేన్ బాసా R/o పీర్ల చావిడి వద్ద బసాపురం గ్రామము గాజులపల్లి మండలం నంద్యాల జిల్లా అను అతను అరకు కు చెందిన వ్యక్తి దగ్గర నుండి గంజాయిని కొనుక్కొని తన షిఫ్ట్ డిజైర్ కారులో నంద్యాల కు తీసుకొని వచ్చి తనకు వరుసకు తమ్ముడైన (ఏ2) షేక్ మహబూబ్ బాషా 25 సం. తండ్రి వలి బాష R/o పీర్ల చావిడి వద్ద బసాపురం గ్రామము గాజులపల్లి మండలం నంద్యాల జిల్లా అనునతనికి గంజాయిని ఇస్తూఉండగా రాబడిన ఖచ్చితమైన సమాచారము మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి ఎం.జావళి ఆల్ఫోన్స్ ఐపీఎస్ సూచనలతో నంద్యాల 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఇ. కంబగిరి రాముడు మరియు అతని సిబ్బంది, డిప్యూటీ తహశీల్దార్ గారైన ప్రసాద్ మరియు ఎక్సైజ్ ఎస్సై వరప్రసాద్ మరియు పంచాయతీదారులతో పాటు అక్కడికి వెళ్ళి సదరు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదముగా గుర్తించి వారిని తనిఖీ చేయగా వారు గంజాయిని అక్రమముగా కలిగి ఉండినారని, గంజాయిని అక్రమముగా రవాణా చేయడము గాని అక్రమముగా కలిగి ఉండడము గాని గంజాయిని అమ్మడము నేరమని తెలిపి వారిని అరెస్టు చేసి సదరు ముద్దాయిల వద్ద నుండి సుమారు 2.5 కే.జి ల గంజాయిని, మారుతి షిఫ్ట్ డిజైర్ కారును (AP-40-BR 7759) మరియు రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి వారి పైన క్రైమ్ నంబర్ 173/2025 U/s 20(b)(ii)(B) of NDPS Act మేరకు నంద్యాల 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేయడమైనది.సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం నంద్యాల.