PS Telugu News
Epaper

ఎన్టీఆర్, చరణ్ వదిలేసిన ప్రాజెక్ట్.. మహేష్‌తో రికార్డు విజయం

📅 19 Dec 2025 ⏱️ 3:03 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదెలా ఉంటే.. మహేష్ బాబు కెరీర్ లో ఓ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది. కానీ మీకు తెలుసా.. ఆ ప్రాజెక్టు ముందుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందట. కానీ పలు కారణాలతో వీరిద్దరు రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా అవకాశం మహేష్ వద్దకు వచ్చిందట. చివరకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకుందామా.మిర్చి సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ సినిమా.. ఎన్టీఆర్ కోసం ఒక కథ రాసుకున్నారట. కానీ ఆ సమయంలో వరుస కమిట్‌మెంట్స్ ఉండడం వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పారట. ఆ తర్వాత అదే చిత్రాన్ని రామ్ చరణ్ వద్దకు తీసుకెళ్లారట. పలు కారణాలతో చరణ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.ఇక అదే చిత్రాన్ని కాస్తా మార్పులు చేసి మహేష్ బాబుకు వినిపించగా.. వెంటనే ఓకే చేశారట. అదే శ్రీమంతుడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 2015 ఆగస్ట్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

Scroll to Top