భైంసా పట్టణం లోని సంతోషి మాత ఏరియాలో స్వచ్ఛభారత్ పితా మహుడు సంత్ గాడ్ గే బాబా యొక్క 69 వ. వర్ధంతి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
బాబా చిత్ర పటానికి సంత్ గాడ్ గే బాబా అవార్డ్ గ్రహీత సుంకేట పో శెట్టి ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇ సందర్భంగా సుంకేట పో శెట్టి మాట్లాడుతూ, మనసులోని మలినాన్ని శుభ్రపరచి సమాజంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థతొ పాటు, మూఢ నమ్మకాలు, అవిద్య నుండి పేద ప్రజలకు విముక్తి కలిగించేందుకు తన కీర్తనల ద్వారా యావత్ సమాజాన్ని జ్ఞానోదయం వైపు నడవాలని బాబా బోధించే వారు, అంతె కాకతనభక్త బృందం ద్వారాఇచ్చే కానుకలను, నిరుపేద ప్రజల కోసం ధర్మ శాలలు, పాఠశాల లు, హాస్పత్రులు నిర్మాణం చేసి పేద ప్రజలకే అంకితం చేశారు. బాబా చేసిన సేవలను గుర్తించిన మహా రాష్ట్ర ప్రభుత్వం బాబా పేరు మీద యావత్ మాల్ జిల్లాలో విశ్వ విద్యాలయానికి, సంత్ గాడ్ గే బాబా పేరు పెట్టారు. ఆనాటి కాలంలో అంటరానితనంకొనసాగుతుంటే, దీన్ని నివారించటానికి, దళితుల కోసం చౌక మేళ పేరుతో పెద్ద ధర్మ శాలను నిర్మించి డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి కి అంకితం చేశారు. ఇలాంటి సేవలను ఆదర్శంగా తీసుకొని డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ గాడ్ గే బాబా ను గురువుగా ప్రకటించూకొన్నారు. మహా రాష్ట్ర ప్రభుత్వం బాబా జయంతి, వర్థంతి లను అధికారికంగా, నిర్వ హిస్తుంది, అదె విధంగా బాబా గారి చేసిన సేవలను గుర్తించికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లు వీరి జయంతి, వర్థంతి లను అధికారికంగా నిర్వ హించి, వీరి చరిత్రను పాఠ్యాంశం లొ చేర్చి, గాడ్ గే బాబా కు భారత రత్న ఇవ్వాలి. అని పోశెట్టి కేంద్ర ప్రభుత్వం నకు కోరారు. ఇ కార్య క్రమంలో, బిజెపి రాష్ట్ర ఓ బిసినాయకులు బో స్లే బాజీ రావ్ పటేల్, నూతనంగ ఎన్నికైన బామ్ ని సర్పంచ్ డి. బాలాజీ, మెంబెర్స్, యోగెస్ పటేల్, బొజ్రాం పటేల్, మాధవ్ పటేల్, బిసి నాయకులు నందు, పిరాజి తది తరులు పాల్గొన్నారు.