PS Telugu News
Epaper

విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం.

📅 20 Dec 2025 ⏱️ 6:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్.20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

యాడికి మండలం కోన రోడ్డులో గల చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమంలో విజన్ స్కూల్ కరస్పాండెంట్ విశ్వనాథ్ జన్మదినం సందర్భంగావిశ్వనాథ్ అభిమానులు వృద్ధులచే కేక్ కటింగ్ చేయించి, అనంతరం వృద్ధులకు చక్కటి విందును ఏర్పాటు చేసినారు. విశ్వనాథ్ కు పెద్దల ఆశీస్సులు ఉండాలని,ఎల్లవేళలా సంతోషంగా ఉండాలనిపెద్దలకు అన్నదానంచేయడం జరిగిందని తెలిపారు. ఆశ్రమంలోనివృద్ధులు మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజన్ స్కూల్ కరస్పాండెంట్ విశ్వనాథ్ ఉన్నతశిఖరాలను అధిరోహించాలని విశ్వనాథ్ ఆయురారోగ్యాలతో అన్నివేళలా సంతోషంగా గడపాలని ఆశ్రమంలోనివృద్ధులు ఆ దేవున్ని ప్రార్థించారుఈ కార్యక్రమంలోఆశ్రమ నిర్వాహకులు బాలయ్య, రామమోహన్,సత్య మరియువిశ్వనాథ్ అభిమానులు, తిరుమలేష్,శివకోటి, రాజబాబు,కార్తీక్, యువరాజ్,కుమార్, గిల్లి,వెంకటాద్రి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top