నంద్యాల నుండి రేణిగుంటకు వెళ్లే డెమో రైళ్లో మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్ధి , యువజన , ప్రజా సంఘాల జేఏసీ నేతలు వినతి పత్రం
పయనించే సూర్యుడు డిసెంబర్ 22, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
నంద్యాల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నంద్యాల నుండి రేణిగుంటకు వెళ్లే డెమో రైల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు , గర్బిణీ స్త్రీలు, వృద్ధులు , దివ్యాంగులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రైలు సౌకర్యంగా ఉంది కావున చాలామంది వివిధ వ్యాపారాల రీత్యా పట్టణాలకు , మరియు కడప & తిరుపతి & చిత్తూరు లాంటి ప్రాంతాల దైవదర్శనములకు , ఉద్యోగస్తులు ఆఫీసులకు వివిధ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. కావున వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజా సంఘాల జేఏసీ నేతలు సన్నాల సాయిరాం రెడ్డి , రామినేని రాజునాయుడు, వేణుమాధవ రెడ్డి , రవీంద్రనాయక్ , అంజి తదితరులు నంద్యాల రైల్వే అధికారులకు వినతిపత్రాన్ని అందజేసి సమష్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.