అశ్వాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ గా సదర్ లాల్ ప్రమాణ స్వీకారం
పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 22: అశ్వాపురం
మండల కేంద్రం అయిన అశ్వాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా బానోత్ సదర్ లాల్ ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు మరియు 16 వార్డుల సభ్యులు నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేయుట జరిగింది సర్పంచ్ సదర్ లాల్, శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను అని ప్రమాణం చేసి, ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం వారు పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన తక్షణమే పరిష్కరిస్తాను అని తన గెలుపుకు అహర్నిశలు కృషిచేసిన పెద్దలు తుళ్లూరి బ్రహ్మయ్య మరియు నాయకులు కార్యకర్తలు అందరికీ రుణపడి ఉంటాను అని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాను అని తన విజయానికి గడప గడప తిరిగి గెలుపుకు సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గార్ల ఆశీర్వాదం తో మరియు
గ్రామస్థుల సహకారంతో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, అశ్వాపురం మేజర్ పంచాయతీ ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, గ్రామస్థులు, నాయకులు పాల్గొని నూతన ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత, మాజీ సర్పంచ్ శారద, వార్డు అభ్యర్థులు వేములపల్లి హషిత,కొమరం కౌసల్య,గుర్రం త్రివేణి, నూకల లింగయ్య, సవలం అనిల్, నాయకులు వేములపల్లి రమేష్, షేక్ ఖధీర్,బూతం వెంకటేశ్వర్లు, తదితరులు మరియు గ్రామస్తు
