మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాల్సిందే
పయనించే సూర్యుడు డిసెంబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
విబి-జి రామ్ -జీ చట్టం రద్దు చేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం పతనం కాక తప్పదు వామపక్ష నాయకుల హెచ్చరిక
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని, భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించి వీ.బీ. జి.రామ్. జి.పేరు మార్పు చేసి చట్టం చెయ్యడాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాలపై 40% నిధులు భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నూనెపల్లి జంక్షన్ నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అనంతరం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డ్రామా పీడీ సూర్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు లు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామచంద్రుడు,నరసింహ నాయక్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ జిల్లా నాయకులు మురళీధర్ డి శ్రీనివాసులు,సిపిఎం సీనియర్ నాయకులు తోట. మద్దులు, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, కే మహమ్మద్ గౌస్, పి వెంకట లింగం, మౌలాలి,సిపిఎం మండల కార్యదర్శి వెన్న బాల వెంకట్ , వామపక్ష ప్రజాసంఘాల నాయకులతో పాటు 100 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేటర్ సంస్థలకు రుణాలను 11 సంవత్సరాల కాలంలో 17 లక్షల కోట్లకు పైగా చేయించిందని కానీ దేశం అభివృద్ధి చెందాలంటే పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందాలి గ్రామీణ ప్రాంతం లో ఉన్న ఏకైక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం గత 11 సంవత్సరాల కాలంలో అరకోర నిధులు కేటాయించి పూర్తిగా ఎత్తివేయాలని దురుద్దేశంతో వి బి- జి రామ్- జి అనే పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెంటనే విబి-జి రామ్ -జీ పేరును రద్దు చేసుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 60 శాతం మాత్రమే ఇస్తాము మిగిలిన 40% రాష్ట్రాలే భరించాలని, కేంద్రం ఎప్పుడు పని మొదలు పెడుతుందో కేంద్రమే తెలియజేస్తుందని రాష్ట్రాలకు ఎలాంటి హక్కు లేదని చెప్పడం చాలా దుర్మార్గమని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పథకం అందకుండా నిర్వీర్యం చేసి పూర్తిగా ఎత్తివేయాలని దురుద్దేశం తో దుర్మార్గమైన విధానాన్ని అనుసరిస్తుందని గాంధీని దేశమంతా జాతిపితగా గౌరవిస్తుంటే, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలన సాగిస్తున్న బిజెపి మహాత్మా గాంధీ పైన ఉన్న అక్కస్సును వెళ్లగక్కుకునేందుకు గాడ్సే వారసులమంటూ నిరూపించుకునేందుకు పేరు మార్చుతూ లోక్సభలో ప్రవేశపెట్టడం లౌకిక పార్టీలన్నీ వ్యతిరేకించిన బలం ఉందని ఆమోదించుకోవడం దుర్మార్గమని, వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలిపి చట్టాన్ని తీసుకురావడం జాతిపిత మహాత్మ గాంధీని మరోసారి హత్య చేయడమేనని, గాంధీజీ పేరును పలుకబోము అలా పిలిచే ఏ పథకమైనా రద్దు చేస్తామని ప్రజలకు సంకేతాన్ని ఇచ్చిందని అన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు గ్రామీణ ప్రాంతా ప్రజలకు అండగా పనులు కల్పిస్తూ ఎంతో కొంత కూలి చెల్లించే పథకాన్ని నిర్వీర్యం చేయడం పేరు మార్పు చేయడం దుర్మార్గమని రాబోయే కాలంలో కార్మికులు వ్యవసాయ కార్మికులు కలిసి ఉద్యమాలు ఉదృతం చేసి కేంద్ర ప్రభుత్వానికి చరమగీతం పాడేలా పోరాటాలు చేయాలని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ను యధావిధిగా కొనసాగించి ,200 రోజులు పని దినాలు కల్పించి,600 రూపాయలు రోజువారి కూలీ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని లేకుంటే బిజెపి ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు.
అభివందనములతో దర్శనం. లక్ష్మణ్ సిపిఎం నంద్యాల పట్టణ కార్యదర్శి, నంద్యాల
