సారంపల్లి నూతన సర్పంచిగా గుగ్గిళ్ళ లావణ్య పదవి బాధ్యతల స్వీకరణ
పయనించే సూర్యుడు, డిసెంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండల కేంద్రంలోని సారంపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య ఈరోజు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ఆమె గ్రామాభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, సారంపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకే మహేందర్ రెడ్డి హాజరై నూతన సర్పంచ్‌ను అభినందించారు. అనంతరం ఆయనకు గ్రామ ప్రజల తరఫున ఘనంగా సన్మానం నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
