బాలికలకు కరాటే తరగతులు ప్రారంభించిన హెడ్మాస్టర్ రవి
కరాటే సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో బాలికలకు కరాటే శిక్షణ
( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్ నగర్ మండలం విట్యాల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో సోమవారం నుండి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ (కరాటే) క్లాసులు ప్రారంభించడం జరిగింది. స్కూల్ హెడ్మాస్టర్ రవి కరాటే సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో క్లాసులను ప్రారంభించడం జరిగింది. సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ బాలికలకు మార్షల్ ఆర్ట్ నేర్పించడం జరుగుతుందని అన్నారు. బాలికలు అందరూ ఈ మార్షల్ నేర్చుకోవాలని తమను తాము రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరక శక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ రవి మరియు కరాటే మాస్టర్ నరేందర్ నాయక్, ఉపాధ్యాయులు కల్పన, మల్లేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.