PS Telugu News
Epaper

“ఓటీటీ మార్కెట్‌లో సంచలనం.. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఫ్యాన్సీ డీల్!”

📅 23 Dec 2025 ⏱️ 12:35 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్‌గారు’. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాహు గార‌పాటి, సుష్మిత కొణిదెల నిర్మాత‌లు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్న‌ర్స్‌ను క‌మ‌ర్షియల్ కోణంలో రూపొందిస్తూ వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటోన్న డైరెక్ట‌ర్ అనీల్ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం ఓ వైపు.. మెగాస్టార్ చిరంజీవి మ‌రో వైపు.. ఈ కాంబోలో వ‌స్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఫ్యాన్సీ ఆఫ‌ర్స్‌ను ద‌క్కించుకుంద‌ని ట్రేడ్ స‌ర్కిల్స్ అంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓవ‌రీసీస్ బిజినెస్ డీల్‌లో మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ఆఫ‌ర్‌ను ద‌క్కించుకున్నాడ‌ని టాక్‌. వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. ఓవర్సీస్ డీల్ రూ.20 కోట్ల‌కు కుదిరింది. ఈ మొత్తాన్ని బ్రేక్ ఈవెన్‌గా సాధించాలంటే నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 మిలియ‌న్ డాల‌ర్స్‌గా.. ఓవ‌రాల్ ఓవ‌ర్సీస్ రైట్స్ ప‌రంగా చూస్తే 4.75 మిలియ‌న్ డాల‌ర్స్ బ్రేక్ ఈవెన్‌ను సాధించాల్సి ఉంటుంద‌ని మూవీ బిజినెస్ వ‌ర్గాలంటున్నాయి. సంక్రాంతి సీజ‌న్ కాబ‌ట్టి ఈజీగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని అందరూ లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌.చిరంజీవి స‌ర‌స‌న ఈ సినిమాలో న‌య‌న‌తార క‌థానాయిక‌. కాగా.. విక్ట‌రీ వెంక‌టేష్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇస్తున్నాడు. వీరిపై వ‌చ్చే కీల‌క స‌న్నివేశాలు .. సాంగ్ అన్నీ అభిమానుల‌ను ఉర్రుత‌లూగిస్తాయ‌ని ఆ మ‌ధ్య ఓ సంద‌ర్భంలో అనీల్ రావిపూడి చెప్పిన సంగ‌తి తెలిసిందే. మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాతో వింటేజ్ చిరంజీవిని తనదైన కమర్షియల్ యాంగిల్లో అనీల్ పొట్రేట్ చేయబోతున్నాడు. ఇందులో బాడీ గార్డ్, విశ్వాసం సినిమాల్ని కలిపి తన స్టైల్లో కొత్తగా చూపించబోతోన్నాడని సమాచారం. ఎక్స్ సెక్యూరిటీ ఆఫీసర్.. ఓ రిచ్ బిజినెస్ మెన్ కూతురికి బాడీ గార్డ్‌గా రావాల్సి వస్తుంది. ప్రేమ, పెళ్లి, డైవర్స్, కూతురు, సెంటిమెంట్ వంటి అంశాలను కలగలిపి ఎంట‌ర్‌టైనింగ్ వేలో సినిమా ఉండ‌నుంద‌ని స‌మాచారం.

Scroll to Top