అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ
చౌడమ్మ గుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ నాగర కుంట నవీన్ రెడ్డి
అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని దాని ద్వారా సమాజంలో ఐక్యత,భక్తిభావం పెరుగుతుందని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి అన్నారు.షాద్ నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వాముల కొరకు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి దంపతులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గురు స్వాములు వన్నాడా ప్రకాష్ గౌడ్ స్వామి,గున్నేలి రమేష్ స్వామి,అయ్యప్ప స్వాములు మరియు మాజీ కౌన్సిలర్స్ కానుగు అనంతయ్య, ఈశ్వర్ రాజు,పాలమాకుల చెన్నయ్య,బీఆర్ఎస్ నాయకులు రఘునాథ్ యాదవ్,పల్లె రఘుపతి రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
