విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం – ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి.
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా
భీమ్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ సబ్జెక్టుకు సంబంధించిన మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు ఏ విధంగా అకౌంట్స్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ లెక్కలను ఏ విధంగా తనిఖీ చేస్తారో మరియు ఆడిటింగ్ చేస్తారో కంప్యూటర్స్‌లో బిల్స్ ఏ విధంగా చేస్తారో ఓజేటి సెంటర్ ను తనిఖీ చేసి విద్యార్థులను అడిగి ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి తెలుసుకున్నారు. ఈ ఒకేషనల్ కోర్సులతో అనేక ప్రయోజనాలు ఉంటాయని ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయపాల్ రెడ్డి ,లెక్చరర్స్ క్రాంతి కృష్ణ ,రామచందర్ ఓం ఎంటర్ప్రైజెస్ మేనేజ్మెంట్ సురేందర్, శ్వేత పాల్గొన్నారు