PS Telugu News
Epaper

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కి యాడికి మండలం విద్యార్థిని

📅 24 Dec 2025 ⏱️ 5:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

యాడికి మండలం పరిధి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనఉప్పలపాడు గ్రామంలో నీ ఎనిమిదో తరగతి విద్యార్థిని కుమారి సుహాసిని ఈ రోజు రాష్ట్ర స్థాయిలో విజయవాడ యందు జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగాపాఠశాల ప్రధానోపాధ్యాయులు కె, చిన్నపెద్దన్న మరియు గైడ్ టీచర్ వై. ఆర్.కృపావతి మరియు సహచర ఉపాద్యాయులు అరుణకుమారి, విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచము లో ప్రతి రోజు రోడ్డు ప్రమాదంలోఅనేక వేలమంది చనిపోతూ చనిపోవడం, ప్రమాదములకి గురి ఐ తీవ్రంగా గాయపడి వికలాంగుల వలె తయారు అవుతున్నారు.ఈ విషయాన్నిదృష్టి లో పెట్టుకొనిఆధునిక ప్రపంచంలోనూతన టెక్నాలజీతోపగలు, రాత్రి పూటఎటువంటి వాహనాలు లలో ఐన ప్రయాణంచేసేవారు ఈ విద్యార్థిని తయారు చేసిన ఇంటెలిజెన్స్ స్మార్ట్ సన్ గ్లాస్ పెట్టుకుని డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవరు పొరపాటు న నిద్ర పోయి కళ్ళు మూత వేస్తే వెంటనే సైరన్ మోగే విధంగా రూపొందించారు.మా పాఠశాలనుంచి మొదటిసారి గా రాష్ట్రస్థాయికి సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థినిసుహాసిని మరియు గైడ్ టీచర్ మరియుసహచర ఉపాద్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె చిన్నపెద్దన్న మరియు ఇతర ఉపాద్యాయులు, గ్రామపెద్దలు, ప్రజలు,విద్యా కమిటీ సభ్యులుఅందరూ అభినందనలు తెలిపారు

Scroll to Top