PS Telugu News
Epaper

జీవోలను మార్చి ప్రజలని మోసం చేస్తున్న కాంగ్రెస్

📅 26 Dec 2025 ⏱️ 2:40 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్

కాంగ్రెస్ నాయకులది అర్బాటం తప్పా చేసింది ఏమి లేదు

బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే మల్లి పేర్లు

భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో భీంగల్ పట్టాణానికి చేసింది ఏమి లేదని, రెండేండ్లలో తట్టేడు మన్ను కూడ పోయలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బోదిరే నర్సయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల భగత్ విమర్శించారు. భీంగల్ పట్టణంలోని ఎల్జే ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2018 లోఅధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ అభివృద్ధి కొరకు రూ 25 కోట్లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. తరువాత 8 ఆగస్ట్ 2023 న పట్టణంలోని వివిధ అభివృద్ధి పనుల కొరకు రూ 10 కోట్లతో జీవో ను అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విడుదల చేయించారని పేర్కొన్నారు. అట్టి జీవో ద్వారా పట్టణం లోని వివిధ వార్డ్ ల్లో అభివృద్ధి పనులను గుర్తించడం, గుర్తించిన పనులకు టెండర్లు వేయడం జరిగిందని తెలిపారు. తీరా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత టెండర్లు అయిన పనులను అగ్రిమెంట్ కాకుండా నిలిపి వేయడం జరిగిందని పేర్కొన్నారు. టెండర్ అయిన పనులను కాకుండా చేయడం ద్వారా అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి పేరు రాకుండా చేయడం లో కాంగ్రెస్ నాయకులు విజయం సాధించారని విమర్శించారు. తీరా మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో అప్పుడు అగ్రిమెంట్ కాకుండా అడ్డుకున్న పనులకు తిరిగి అగ్రిమెంట్ చేసి పట్టణం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తున్నట్టు డ్రామా కు తెరలేపడం జరిగిందని విమర్శించారు. ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ 2.0 స్కీం ద్వారా పట్టణం లో నీటి ఏద్దది నివారణకు కాలేజీ వెనుక 11 లక్షల కెపాసిటీ నీటి ట్యాంకు, నర్సరీ లో ఐదు లక్షల నిలువ గల నీటి ట్యాంకులు నిర్మించి అందులోకి పైప్ లైన్ ద్వారా నీటిని నింపి సరఫరా చేసేందుకు పైప్ లైన్ నిర్మాణం కొరకు ఆర్గుల్ సంప్ నుండి ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం కొరకు అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రూ 25 కోట్లు మంజూరు చేయించడం, టెండర్ ప్రక్రియ పూర్తి అయిన సంగతి గుర్తు చేశారు. అట్టి పనులను కూడ కొత్తగా మంజూరు చేసినట్టు చెప్పుకుంటూ శంకుస్థాపన చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి గా ప్రశాంత్ రెడ్డి మంజూరు చేసిన పనులకు పేర్లు మార్చి తిరిగి శంకుస్థాపన లు చేయడం ద్వారా ప్రజల్లో ప్రశాంత్ రెడ్డి పై ఉన్న అభిమానం తుడిచి వేయలేరని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసిన పనులకు కాకుండా అదనపు నిధులు సాధించి పట్టణం అభివృద్ధి కొరకు పాటు పడాలని సవాల్ విసిరారు. టెండర్ ప్రక్రియ పూర్తి అయిన 10 కోట్ల అభివృద్ధి పనులతో పాటు 25 కోట్ల అభివృద్ధి పనుల్లో మిగిలిన కోటి 50 లక్షల కళ్యాణ మండపం నిధులు మొత్తం 11.50 కోట్లతో పనులు చేస్తున్నామని తిరిగి శంకుస్థాపన చేయించడం సిగ్గు చేటని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి గా పని చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించిన పనులను తిరిగి మంజూరు చేయించినట్టు చెప్పుకోవడం ప్రజలు గమనించాలని కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కొరకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. జీవో లు మార్చినంత మాత్రాన ప్రజల్లో ప్రశాంత్ రెడ్డి పై ఉన్న అభిమానం ఎటు పోదని, అభివృద్ధి చేసింది ఎవరో అడ్డుకుంటుంది ఎవరో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశం లో బీఆర్ఎస్ నాయకులు సతీష్ గౌడ్, మల్లెల ప్రసాద్, మూత లింబాద్రి, రాజు నాయక్, పతాని లింబాద్రి, నల్లూరి లింబాద్రి, ఇక్రమ్, రతన్ రాజ్, అశోక్, రామకృష్ణ, చరణ్, సాదు, సునిల్, సాగర్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top