ఖమ్మం నగరంలో ఫైనాన్స్ వ్యాపారుల నయా దందా.
పయనించే సూర్యుడు డిసెంబర్ 27 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం:
ఆస్తులు రిజిష్టర్ చేసుకుని అప్పు తీర్చిన తరువాత ఆస్తులు తిరిగి ఇచ్చేటట్లు ఒప్పందాలు. కానీ అప్పు తీరిన తరువాత కూడా ఆస్తులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కొంతమంది ఫైనాన్సీయర్లు
తాజాగా ఓ కుటుంబానికి చెందిన పద్నాలుగు కోట్ల రూపాయల విలువచేసే భూమిని తాకట్టు పెట్టుకున్న ఫైనాన్షియర్. ఇటీవల కాలంలో పూర్తి అప్పు తీర్చినప్పటికీ తిరిగి ఆస్తులు అప్ప జెప్పకుండా బాధితులను బెదిరిస్తున్న ఫైనాన్షియర్ బడా రాజకీయ నాయకులు,కాంట్రాక్టర్ల అండతో పెట్రేగి పోతున్న ఫైనాన్షియర్…
మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బాధితులపై దాడికి యత్నం గతంలో కూడా అప్పు చెల్లించలేని వారిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ,భార్యల మెడలో తాలిబోట్లు లాక్కున్నట్లు సదరు ఫైనాన్షియర్ పై ఆరోపణలు
ఈ విషయం మీద పోలీసు కమిషనర్ కు పిర్యాదు చేసి బాధితులు,ఇప్పటివరకు స్పందించని పోలీసులు
ఖమ్మం నగరంలో ఇన్ని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ఫైనాన్షియర్ ను అడ్డంగా కాపాడుతున్న రాజకీయ నాయకులు,కాంట్రాక్టర్లు.సదరు ఫైనాన్షియర్ ఆగడాల మీద ఉక్కు పాదం మోపి ఎందరో బాధితులకు న్యాయం చేసిన అప్పటి జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఈ ఫైనాన్షియర్ పై అక్రమ దందాలపై విచారణ జరిపితే వేలాదిమంది బాధితులు బయటకు వచ్చే అవకాశం,త్వరలోమరికొంతమంది బాధితులు పోలీసు కమిషనర్ ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం