PS Telugu News
Epaper

గురువుల ఆశీర్వాదం తీసుకున్న నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరియు ఉప సర్పంచ్లు

📅 26 Dec 2025 ⏱️ 6:44 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

శిష్యులను సన్మానించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరుణాకర్

పలు సూచనలు చేసిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ బాదేపల్లి సిద్ధార్థ.( రాష్ట్ర ప్రధాన కార్యదర్శి TPRJC).

( పయనించే సూర్యుడు డిసెంబర్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

తరగతి గదిలో బోధనలు నేర్పిన గురువు ప్రస్తుత మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరుణాకర్ నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరియు డిప్యూటీ సర్పంచులను తన ఇంటికి రప్పించుకొని ఆదిత్యం ఇచ్చి వారిని సన్మానించి గ్రామ సర్పంచులు గా ఎన్నికైన మీరు గ్రామంలో కుల మత వర్గ బేధం లేకుండా అందరినీ సమాన దృష్టితో, ప్రజా సేవతో గ్రామంలోని సమస్యలు తీర్చి, గ్రామంలోని యువతను, మహిళలు మరియు వృద్ధులను వారిపై ప్రత్యేక దృష్టి వహించి సమస్యలు పరిష్కరించాలని. గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనల దిశగా అవకాశం కల్పించి ప్రోత్సహించాలని, గ్రామంలో తాగునీరు సాగునీరు పారిశుధ్య వ్యవస్థను అందుబాటులో ఉంచాలని, గ్రామీణ విద్యను పటిష్ట పరచాలని, గ్రామంలో బెల్ట్ షాపులను బందు చేయించాలని, చెడు దారిలో వెళ్తున్న యువతను సన్మార్గంలో నడిపించాలని. నేటి సమాజానికి అనుకూలంగా సాంకేతికపరమైన అవసరాలు ఏమైనా వాటిని సమకూర్చుకోవాలని. మరుదప ఎలక్షన్ల వరకు మంచి పేరు తెచ్చుకోవాలని ప్రజల ప్రేమాభిమానాలతో గెలవాలని, మధ్యము బిర్యాని పైసలకు ప్రజలను బానిసలను కాకుండా అభివృద్ధికి పట్టం కట్టే వారిగా వారిని తీర్చిదిద్దాలని, మానవసేవయే మాధవ సేవగా భావించి మీ యొక్క విధులను నిర్వహించాలని గురువుగా ఉపదేశం చేశారు. సన్మాన గ్రహీతలు సర్పంచులు

  1. మూడవ శ్రీను నాయక్, సర్పంచ్( దేవుని బండ తండా).
    2.నరేష్ రానా, సర్పంచ్( చింతగూడెం).
    3.గోపాల్ రెడ్డి, సర్పంచ్ (అయ్యవారిపల్లి).
  2. లలిత మల్లేష్ ,సర్పంచ్ (దేవునిపల్లి).5. పావని శివ మొగిలి, సర్పంచ్( చెగిరెడ్డి ఘనపూర్)
  3. వేణు సర్పంచ్( వీరన్న పల్లి -బాలనగర్).
    ఉప సర్పంచ్లు
  4. అమీర్ ఉపసర్పంచ్( నిడద వెళ్లి).2. బాదావత్ శ్యామ్ లాల్ ఉప సర్పంచ్( దేవుని బండ తండా)
  5. శ్రీను నాయక్ ఉప సర్పంచ్( తూర్పు గడ్డ తండా).
  6. రాజు నాయక్ ఉప సర్పంచ్( గిరాయి గుట్ట తండా).
    ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బూర్గుల రఘు, రాము గోర్ల, పోమాల పద్మారావు.
Scroll to Top