వందేళ్ల భారత కమ్యూనిష్టు ఉద్యమానికి విప్లవ జేజేలు
వంద సంవత్సరాల ప్రస్థానం లో పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఎర్రజెండా
ప్రజాపంథా ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరణ
నాయిని రాజు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు
పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:భారతదేశంలో శ్రామిక,పీడిత వర్గాల విముక్తి కోసం, సోషలిజం స్థాపన కోసం ఎర్రజెండా పేదల పక్షాన నిలిచిందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు, సర్పంచ్ అజ్మీర బిచ్చా, పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు.శుక్రవారం కొమరారం గ్రామంలో వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాన్ని నెమరవేసుకుంటూ ప్రజాపంథా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ జెండాను సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి సీపిఐ ఎంఎల్ ప్రజాపంథా కొమరారం గ్రామ కార్యదర్శి వాంకుడోత్ శంకర్ అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడారు. 1921 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో 500 మంది ప్రతినిధులతో జరిగిన మహాసభలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. 2025 డిసెంబరు 26 నేటితో భారత కమ్యూనిస్టు ఉద్యమానికి 100 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంలో కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఎన్నో వీరోచిత పోరాటాలు,అలుపెరగని సాహసాలు, నిర్బంధం గాయాలతో, అమరత్వం తో ఎర్రజెండా కలబడి,నిలబడి అనేక ఫలితాలను ప్రజలకు సాధించిపెట్టిందని అన్నారు. కమ్యూనిస్టులు స్వతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించడంతోపాటు బ్రిటిష్ వలసవాదుల నిషేధాన్ని ఎదుర్కొంటూ ఉద్యమాన్ని నడిపారని అదేవిధంగా నిజాం నిరంకుశత్వం భూస్వాముల కు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని అన్నారు. ఈ వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో నక్సవరి,శ్రీకాకుళం, గోదావరిలోవయ, దండకారణ్యం తదితర ఉద్యమాల అనుభవం వరకు త్యాగాల దారితోపాటు అనేక గుణపాఠాలను,ఎన్నో అనుభవాలను అందించిందని అన్నారు. ఆ అనుభవాలతో భారతదేశంలో బలమైన విప్లవ కమ్యూనిస్టు పార్టీని నిర్మించడమే అమరులకు నిజమైన నివాళి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూక్య పాషా, వెలుగు శాంతారావు, మంగు,బాలు,మూడు చిన్న,భద్రు, ధర్మ,కాంపాటి వెంకన్న, అనుగోజు సత్యనారాయణ,పల్లె రాములు, కాంపాటి జీవన్ తదితరులు పాల్గొన్నారు.