మండెపల్లిలో నట్టల నివారణ మందుల పంపిణీ – పశుసంపద సంరక్షణకు ముందడుగు
పయనించే సూర్యుడు, డిసెంబర్ 27( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ గాధగోని సాగర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ నట్టల నివారణ మందుల వలన మేకలు, గొర్రెలు వివిధ రకాల అనారోగ్యాలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. పశుసంపద ఆరోగ్యం మెరుగుపడితే రైతులు, గొల్ల–కురుమ కుటుంబాలకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.మందుల పంపిణీ కార్యక్రమం ద్వారా గొల్ల, కురుమ సంఘ సభ్యులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో పశుపోషణకు ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అసాని మహిపాల్ రెడ్డి, యాస రాజేష్, కడారి ప్రతాప్ రెడ్డి, జడల ఆనంద్, సింగం శశికుమార్ పాల్గొన్నారు. అలాగే గొల్ల–కురుమ సంఘం ప్రెసిడెంట్ అమరగొండ మొండయ్య, ప్రధాన కార్యదర్శి ఒగ్గు దేవయ్యతో పాటు బండి బీరయ్య, మేకల కుంటయ్య, అమరగొండ ప్రభు దాస్, బోడపట్ల బాలయ్య, జగ్గానీ మల్లేశం, జగ్గాని పరశురాం, ఒగ్గు రాము, ముద్దాల రాజయ్య, అమరగొండ ప్రశాంత్, బండి శ్రీకాంత్, బండి కృష్ణబాబు, అమరగొండ కృష్ణ ప్రసాద్, ముద్దాల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.