1970-75 పూర్వపు విద్యార్థులు అగాపే ఆశ్రమంలో అన్నదానం.
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఆగాపే ఆశ్రమంలో పూర్వపు విద్యార్థులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.యాడికి గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు 1970-75సంవత్సరపు పూర్వపు విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రోగ్రాం అక్టోబర్ 26వ తేదీన ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ బ్యాచ్ కి చెందిన ఆరు మంది పూర్వ విద్యార్థులు కలిసి డిసెంబర్ 29వ తేదీన అనగా సోమవారం అగాపే వృధ్ధాశ్రమంలో ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు వై.వెంకటేశ్వర్లు, సి.మహబూబ్బాషా, ఎల్. నల్లప్ప,జై. సత్యనారాయణ, బి. మంజుల, ఉమామహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారికి అభినందనలు తెలిపారు.
