PS Telugu News
Epaper

అసాధారణ ఆలోచనతో ఆకట్టుకున్న స్థానిక వృద్ధుడు

📅 02 Jan 2026 ⏱️ 10:49 AM 📝 వైరల్ న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కొంత మంది సాదాసీదా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది ప్రాణాలు పోగొట్టుకోగా.. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. తాజాగా ఓ తాత చేసిన చర్య చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆయన బట్టతలనే ఆక్వేరియం చేయడం గమనార్హం. తన బట్టతలపై చేపల తొట్టిగా మార్చేశాడు.ఈ వైరల్ వీడియోలో ఓ వృద్ధుడు తన బట్టతల చుట్టూ ప్లాస్టిక్ కవర్ లాంటి వాటిని అతికించుకున్నాడు. ఆ తర్వాత ఒక స్త్రీ అతని తలపై నీటితోపాటు చేపలను ఉంచుతుంది. దీంతో ఆ నీటిలో చేపలు ఈత కొట్టడం ప్రారంభిస్తాయి. అనంతరం ఆ చేపలకు ఆహారం కూడా పెడుతుంది. దీంతో ఆ తాత బట్టతల చిన్నపాటి ఆక్వేరియంలా మారిపోయింది.ఈ ఫన్నీ వీడియోను డాక్టర్ హేమంత్ మౌర్య అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రజలు ఇలాంటి పనులు చేస్తున్నారంటూ రాసుకొచ్చారు. వీరు తమ తలపై చేపలను పెంచుకుంటున్నారు

Scroll to Top