PS Telugu News
Epaper

నంద్యాలలో వైసిపికి భారీ షాక్

📅 02 Jan 2026 ⏱️ 4:53 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి ముఖ్య అనుచరుడు మరియు వైసిపి పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి పీవీ ప్రదీప్ రెడ్డి

నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసిపి నంద్యాల పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి మరియు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి ముఖ్య అనుచరుడు పీవీ ప్రదీప్ రెడ్డి ఆ పార్టీని వీడి, ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.నంద్యాలలోని టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవీ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న అన్నారు అలాగే నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేస్తున్న విశేష కృషి, అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అందుకే ఫిరోజ్ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని అలాగే రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి యువత, వివిధ పార్టీల నేతలు టిడిపి వైపు చూస్తున్నారని అన్నారు. పివి ప్రదీప్ రెడ్డి చేరికతో నంద్యాల పరిధిలో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు . పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈరోజు ప్రదీప్ రెడ్డి టిడిపి పార్టీలో చేరడంతో వారిపై మరింత బాధ్యత పెరిగిందని కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రదీప్ రెడ్డి పని చేయాలన్నారు.టీడీపీ పార్టీలో చేరిన వారు సతీష్, వినోద్ కుమార్, మధు, నరేష్, శేఖర్, జైలాన్, షేక్షా, మధుమోహన్, మాలిక్, ఆదిశేష, రామచంద్రుడు, సుధాకర్, శశి, శ్రీను, నవీన్, రమణ, అబ్దుల్లా, మా భాష , వలి లతోపాటు 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో 8 వార్డు టిడిపి ఇంచార్జి సుబ్రీ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, ఉప్పర సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, అజ్మీర్, బోయ రామకృష్ణ, ఎబినేజర్, పోన్నాపురం కాలనీ సుబ్బయ్య, ప్రభాకర్ మరియు పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రదీప్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు.

Scroll to Top