భీంగల్ మండలంలో సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కె గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల సర్పంచుల నూతన అధ్యక్షుడు పిప్పి సర్పంచ్ అరికెల జనార్ధన్ ఉపాధ్యక్షుడు రమేష్ భీంగల్ మండల సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక, భీంగల్ మండలంలోని గ్రామాల సర్పంచ్లందరూ సమావేశమై భీమ్గల్ మండల సర్పంచ్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా పిప్రి సర్పంచ్ అరిగేల జనార్ధన్, ఉపాధ్యక్షుడిగా పెద్దమ్మ కాడి తండా సర్పంచ్ బుక్యా రమేష్, ప్రధాన కార్యదర్శిగా పల్లికొండ సర్పంచ్ అశోక్, కార్యదర్శిగా చెంగల్ సర్పంచ్ రాజు, కోశాధికారిగా బాబాపూర్ సర్పంచ్ సమీర్, గౌరవ అధ్యక్షులుగా దేవేందర్ అరవింద్, ముఖ్య సలహాదారులుగా రాజిరెడ్డి, జనార్ధన్ లను ఎన్నుకోవడం జరిగింది.