ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
//పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 4// నారాయణపేట జిల్లా బ్యూరో //
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.సావిత్రి బాయి పూలే 195 వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు.కాంప్లెక్స్ GHM,నాగరత్నమ్మ, సావిత్రి బాయి చిత్ర పటానికి పూలమాల వేసి ఉపాద్యాయులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్య కోసం సావిత్రి బాయి చేసిన త్యాగాలను, సేవలను,విద్యార్థులకు తెలియచెప్పారు.సావిత్రి బాయి ఫూలే స్ఫూర్తి తో,జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవలన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు