PS Telugu News
Epaper

గొడుగుపల్లి గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

📅 03 Jan 2026 ⏱️ 4:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

(పయనించే సూర్యుడు జనవరి 3 దౌల్తాబాద్ రాజేష్)

దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.సర్పంచ్ మద్దెల వనజ స్వామి మాట్లాడుతూ, శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో అవసరమని, జననం నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. తల్లిపాలు శిశువుల శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు.ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై సూచనలు ఇచ్చి, తల్లిపాలపై అపోహలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, వార్డ్ సభ్యులు కర్ర మహేశ్ దుర్గని నర్సింలు మధుసూదన్ మద్దెల మల్లేష్ గ్రామ ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top