సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్
ఘనంగా సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలు మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం
( పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కొత్తూరు మండలం చింతగట్టు తాండ ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు టి చంద్రయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. స్కూల్ ఉపాధ్యాయులు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ బాసు నాయక్ ను మరియు వార్డ్ నెంబర్ సభావత్ వెంకట్ ను సన్మానించడం జరిగింది. అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ… భారతదేశంలోని అణగారిన అంటరాని కులాలకు అక్షరాన్ని అందించిన ఘనత సావిత్రిబాయి పూలే ది అని అన్నారు. మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించి సమాజంలోని అసమానతల పై పోరాడిన వీర వనిత అని అన్నారు. మనమందరం సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సునీత నాట్కో టీచర్స్ లతా సంగీత రోజా మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
