జోగుళాంబ గద్వాల్ పోలీస్ సైబర్ బాధితులకు ఊరట..
పయనించే సూర్యుడు తేదీ 4 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న.
: 2.46 లక్షలు రికవరీ చేసిన గద్వాల్ పోలీసులు సత్వర చర్యతో నమ్మకం పెంచిన పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు జోగుళాంబ గద్వాల్ జిల్లాలో సైబర్ మోసాలకు గురైన బాధితులకు పోలీసులు అందించిన సత్వర సహాయం పెద్ద ఉపశమనంగా మారింది. కోర్టుల ఆదేశాలు, బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో మొత్తం రూ.2.46 లక్షలు రికవరీ చేసి బాధితులకు రిఫండ్ చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., తెలిపారు. మల్దకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ కేసులో బాధితురాలు కోల్పోయిన రూ.1.80 లక్షల్లో రూ.1 లక్షను విజయవంతంగా రికవరీ చేసి రిఫండ్ చేయించారు. ఈ కేసులో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, గద్వాల్ న్యాయమూర్తి గౌరవ ఎన్.వి.హెచ్. పూజిత రిఫండ్ ఆర్డర్ జారీ చేశారు. అలాగే కలుగోట్ల గ్రామానికి చెందిన వ్యక్తి సైబర్ మోసానికి గురై రూ.1.90 లక్షలు కోల్పోగా, ఆలస్యంగా ఫిర్యాదు చేసినప్పటికీ రూ.56 వేలును రికవరీ చేసి రిఫండ్ చేయడం జరిగింది. ఈ కేసులో జూనియర్ సివిల్ జడ్జ్, అలంపూర్ కోర్టు న్యాయమూర్తి గౌరవ ఆర్.వి.ఎస్.ఎస్. మిథున్ తేజ ఆదేశాలు జారీ చేశారు.తుమ్మల చెరువుకు చెందిన మరో బాధితుడు ఏపీకే ఫైల్‌ను టచ్ చేయడంతో రూ.90 వేలును కోల్పోగా, వెంటనే గట్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మొత్తం నగదు పూర్తిగా రిఫండ్ అయ్యింది. ఈ కేసులో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి గౌరవ ధరావత్ ఉదయ నాయక్ రిఫండ్ ఆర్డర్ జారీ చేశారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు వెంటనే ఫిర్యాదు చేస్తే న్యాయం సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. సమయోచిత స్పందన, కోర్టుల సహకారం, పోలీస్ సమన్వయం కలిసి బాధితులకు వేగంగా న్యాయం అందించగలిగాయని అన్నారు. ఈ సందర్భంగా బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసుల్లో కీలక సేవలందించిన డి–4–సి సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్, మల్దకల్ సైబర్ వారియర్ అడ్డాకుల నవీన్, ఉండవల్లి సైబర్ వారియర్ రవి, గట్టు సైబర్ వారియర్ భీమేష్, గట్టు ఎస్ఐ కే.టి.మల్లేశ్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు. పి ఆర్ ఓ జిల్లా పోలీస్ కార్యాలయం, జోగుళాంబ గద్వాల్ జిల్లా.