పన్నులతోనే పట్టణాభివృద్ధి–పన్నులు సకాలంలో చెల్లించాలి– – మున్సిపల్ రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి-
పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న.
నంద్యాల పట్టణ అభివృద్ధికి ప్రతి పౌరుడు పన్నులు సమయానికి చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, నీటి కుళాయి పన్నులు సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.పట్టణంలో మొత్తం 50,038 అసెస్మెంట్లు ఉండగా, వాటికి రూ.35 కోట్ల 29 లక్షల 23 వేల డిమాండ్ ఉందన్నారు. డిసెంబర్ 31 నాటికి రూ.16 కోట్ల 15 లక్షలు వసూలు కాగా, ఇంకా రూ.19 కోట్ల 14 లక్షలు బకాయిలుగా ఉన్నాయని తెలిపారు.
నీటి పన్నుల విషయంలో పట్టణంలో 32,820 కనెక్షన్లు ఉండగా, రూ.11 కోట్ల 70 లక్షల 17 వేల డిమాండ్ ఉందన్నారు. ఇప్పటివరకు రూ.4 కోట్ల 31 లక్షలు వసూలు కాగా, ఇంకా రూ.7 కోట్ల 38 లక్షలు బకాయిలుగా ఉన్నాయని వివరించారు. అలాగే పట్టణంలో 2,985 ఖాళీ స్థలాలు ఉండగా, వాటికి రూ.1 కోటి 78 లక్షల 6 వేల డిమాండ్ ఉందని, ఇప్పటివరకు రూ.48 లక్షల 45 వేలు మాత