గొల్లపల్లి లో సమస్యల పరిష్కారం వేదిక తాసిల్దార్ మస్తానయ్య
పయనించే సూర్యుడు జనవరి 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం లోని గొల్లపల్లి గ్రామంలో 2026 జనవరి నెలలో ప్రతి మంగళవారం తేది:06.01.2026, 13.01.2026, 20.01.2026 . 27.01.2026 న అధికారులచే నిర్వహించు గ్రామ రెవిన్యూ సమస్యల పరిష్కార వేదికను చేజర్ల మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల నందు నిర్వహించుటకు నిర్ణయించడమైనది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీ భూ సంబంధిత . ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు సమర్పించి, మీ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని పొందవలసిందిగా మనవి చేయుచున్నాము. ప్రజలు మరియు రైతులందరూ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొనగలరని మండల తాసిల్దార్ ఆర్. మస్తానయ్య సోమవారం తెలిపారు ఈ సందర్భంగా తాసిల్దార్ మస్తానయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఆదేశాల మేరకు. వన్ మంత్. వన్ విలేజ్. ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని సమస్యలు పై తెలిపిన తేదీలలో గ్రామ ప్రజలు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు