PS Telugu News
Epaper

దేశంలోనే విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత చంద్రబాబుదే….

📅 05 Jan 2026 ⏱️ 5:18 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

కృతజ్ఞతలు తెలియపరిచిన గుత్తుల సాయి

జనం న్యూస్ జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలపై భారం మోపకుండా విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడు వారికే దక్కుతుంది అని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి అన్నారు, 2019 – 2024 లో జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా అయిదు సంవత్సరాల కాలంలో 38 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపి వ్యవస్థలను బ్రష్టు పట్టించి వ్యవసాయ రంగాన్ని, విద్యుత్ రంగాన్ని నిరీవర్యం చేసాడని, 2019 2024లో జగనమోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కాలంలో 4, 489 కోట్ల రూపాయలు ప్రజలు వద్ద నుండి ట్రూ అప్ చార్జీలు వసూలు చేసి ప్రజలఫై భారం మోపడంతో పాటు ఎక్కవ ధరకు విద్యుత్ను కొనుగోలు చేసి కోట్ల ధనం కొల్లగొట్టడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు ట్రూఅప్ చార్జీలను రద్దు చేసి, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారం పడకుండా యూనిట్ఫై 13 పైసలు ట్రూ డౌన్ చార్జీలు తగ్గించిన ఘనత చంద్రబాబు నాయుడు కే దక్కింది అని, జగనమోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కాలంలో ఆక్వా రైతులు దగ్గర నుండి యూనిట్ కి రూ 3.50 వసూలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆక్వా రైతులకు యూనిట్ రూ 1.50 కి ఇచ్చి రైతులను అదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారని, రెన్యూబుల్ ఎనర్జీని ప్రోత్సహించలనే లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ లకు ఉచితంగా సోలార్ రూప్ టాప్ లు, అందిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని, బీసీ లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో పాటు మరో రూ. 20 వేల రూపాయలు రాయితీపై సోలార్ విధ్యుత్ అందిస్తున్న ఘనత కూడా చంద్రబాబు నాయుడు కే దక్కుతుంది అని గుత్తుల సాయి తెలిపారు.

Scroll to Top