ఘర్ ఘర్ తిరంగా యాత్రను జయప్రదం చేయండి .బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ఘర్ ఘర్ తిరంగా యాత్ర ను బిజెపి నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ పిలుపునిచ్చారు. బైంసా పట్టణంలోని ఎస్. ఎస్. జిన్నింగ్ ఇండస్ట్రీ లో తిరంగా యాత్రపై బిజెపి నాయకులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం కంటే ముందే ప్రతి ఇంట జాతీయ జెండాను ఎగరవేయాలని సూచించారు. భారతీయులంతా సగర్వంగా తిరంగా యాత్రను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బైంసా పట్టణంతోపాటు మండల కేంద్రాల్లో తిరంగా యాత్రను నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా ప్రతి బూత్ లో, స్వాతంత్ర దినోత్సవం వేళ జాతీయ జెండాను ఎగరవేయాలని సూచించారు. యాత్ర విజయవంతమయ్యేలా ప్రతి మండలానికి ఒక ఇన్చార్జి నియమించినట్లు చెప్పారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, రవి పాండే, ఘర్ ఘర్ తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్ రావుల రామ్ నాథ్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సాదు ప్రభాకర్, బిజెపి పట్టణ మండలాల అధ్యక్షులు రావుల రాము, సిరం సుష్మ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.