అన్నారంలో సానిటైజర్ కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ లావణ్య రామకృష్ణ
( పయనించే సూర్యుడు ఆగస్టు 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ లావణ్య రామకృష్ణ ఆధ్వర్యంలో సానిటైజర్ కార్యక్రమాన్ని చేయించారు. సీజనల్ వ్యాధులు అరికట్టేందుకే ముందు జాగ్రత్తగా శానిటైజేషన్ చేయించడం జరిగిందని వర్షాకాలం కావడంతో ఈగలు దోమలు వంటివి రాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా సానిటైజేషన్ చేయించామన్నారు సర్పంచ్ లావణ్య రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య రామకృష్ణ తోపాటు గ్రామపంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ ఉప సర్పంచ్ శివశంకర్ వార్డ్ సభ్యులు రవి శ్రీలత మల్లేష్ అర్చన రాజు విష్ణు మహేష్ జి శ్రీశైలం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.