మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం సర్పంచ్ శ్రీను నాయక్

August 6, 2026 | తెలంగాణ

గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత తప్పకుండా నిర్మించుకోవాలి

అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తా

ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్

పార్టీ లకు ఆతీతంగా యువకులు గ్రామ అభివృద్ధి కోసం ముందుకు రావాలని సర్పంచ్ పిలుపు

దేవునిబండ తండా గ్రామ సభలో గ్రామ సర్పంచ్ ఎం శ్రీను

( పయనించే సూర్యుడు ఆగస్టు 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )( లోకల్ గైడ్ షాద్ నగర్ ) ఫరూక్నగర్ మండలం దేవునిబండ తండా గ్రామపంచాయతీ లో సర్పంచ్ శ్రీను అధ్యక్షతన ఈరోజు జరిగిన గ్రామ సభలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు యువకులు పాల్గొని మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా మన ఇంటి ఆవరణలో మొలచిన పిచ్చి మొక్కలు పికి శుభ్రం చేసుకోవాలి మోరీల దుర్వాసన రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామంలో పలు అభివృద్ధి అంశాల పై చర్చించి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు.సర్పంచ్ శ్రీను తప్పకుండా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు ఏ కార్య క్రమంలో ఉప సర్పంచ్ శ్యామ్ లాల్ గారు కార్యదర్శి గీతా వార్డు సభ్యులు శమంత సుధాకర్ అంగన్వాడీ టీచర్ సుమతి ఆశ వర్కర్లు లలిత యువకులు ఈశ్వర్ రమేష్ శివ సురేష్ పవన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper