దేవుని బండా తాండ తాగునీటి సమస్య నేటితో ముగింపు
త్రాగునీటి పైపు లైన్ పనులు ప్రారంభించిన సర్పంచ్ ఎం శ్రీను
( పయనించే సూర్యుడు జనవరి 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం లోని దేవుని బండ తండా గ్రామపంచాయతీలో గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండేది కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ శ్రీను గారు మరియు ఉప సర్పంచ్ బాదావత్ శ్యామ్లాల్ మరియు వార్డు సభ్యులు కలిసి ముందుగా తండాలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పైపులైన్ పనులు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పెద్దలు మహిళలు యువకులు సర్పంచ్ శ్రీను గారికి ఉప సర్పంచ్ శ్యామ్లాల్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు మూడవత్ వాలి మారు భగవత్ అరుణ యువకులు, సూర్య లింగం నాయక్ హీరు నాయక్ రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు