బగ్ అమీర్ లోని పలు దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర నాయకులు తెల్ల హరికృష్ణ

August 6, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా కూకట్‌పల్లి బాగ్‌ అమీర్‌ లోని శ్రీ పోచమ్మ తల్లి మరియు శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ. ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను తీసుకొని అమ్మవార్ల కృపకు పాత్రులై. ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు.

🌐 Select Language:
📰 ePaper