పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేస్తున్న ఏలూరు కేశవ చౌదరి
పయనించే సూర్యుడు జనవరి 7( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ముద్రించిన రీ–సర్వే ప్రాజెక్టు పట్టాదారు పాసుపుస్తకాలను, నెల్లూరు జిల్లా కలెక్టరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, సూచనల మేరకు బుధవారం నాగులవెల్లటూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో చేజర్ల మండల తహశీల్దారు, ఆర్ మస్తానయ్య అధ్యక్షతన మండల రెవెన్యూ ఇన్ స్పెక్టరు ల స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కేశవ చౌదరి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రీ–సర్వే ద్వారా భూమి రికార్డులు పారదర్శకంగా మారతాయని, రైతులకు భూ హక్కుల పరంగా మరింత భరోసా లభిస్తుందని తెలిపారు. రైతులు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచి షేక్ మస్తానయ్య. గ్రామ ప్రజలు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
