పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో హిమబిందు
పయనించే సూర్యుడు జనవరి 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం తూర్పుపల్లి . మాముడూరు రైతు సేవా కేంద్రం నందు బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హిమబిందు మాట్లాడుతూ, చాంపియన్ ఫార్మర్ రైతుల వరి పొలాలను పరిశీలించడం జరిగింది వారి పొలాలలో జింకు లోపాలను గుర్తించడం జరిగినది కావున జింకు స్ప్రే చేసుకోవాలని తెలియజేయడం జరిగినది అదేవిధంగా రైతులు అందరూ ఏపీ ఎఫ్ ఆర్ పోర్టల్ రిజిస్టర్ కానీ వాళ్ళ పేర్లు ఆర్ ఎస్ కె వారిగా వచ్చి ఉన్నాయి.వాళ్ళు వెంటనే రైతు సేవ కేంద్రం లో ఏపీ ఎఫ్ ఆర్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలానే ప్రతి రైతు సాగుచేసిన ప్రతి పంటను పంట నమోదు చేసుకోవాలని,తెలియజేయడం జరిగినది ఈకార్యక్రమంలో తూర్పుపల్లి ఎంపీటీసీ సభ్యులు జి. కృష్ణారెడ్డి ఏ ఈ ఓ ఎల్.సుజాత, వి ఏ ఏ .విజయ వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు