PS Telugu News
Epaper

పర్యావరణ పరిరక్షణ సామాజిక పరిశుభ్రత

📅 07 Jan 2026 ⏱️ 6:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు జనవరి ఏడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపాలెం ఏరియాలో సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు వారి అధ్యక్షతన జరిగిన “స్వచ్ఛ సంక్రాంతి “కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చెత్త కుప్పల తొలగింపు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక పరిశుభ్రత కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీధులలో మరియు రోడ్లపై గల చెత్తకుప్పలను తొలగించే చెత్త నుండి సంపద తయారీ కేంద్రమునకు తరలించినారు. మరియు సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ఏపిఎం మరియు డ్వాక్రా యానిమేటర్ లు గ్రామంలో గల ప్రతి ఇంటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించి సామాజిక పరిశుభ్రతకై సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు , డిప్యూటీ ఎంపీడీవో నున్న శివశంకర నారాయణ, ఎ. పి.ఎమ్.శ్రీనివాసరాజు , పంచాయితీ కార్యదర్శి జి వి సత్యనారాయణ, మరియు పంచాయతీ సిబ్బంది,డ్వాక్రా యానిమేటర్ లు, సుంకర పవిత్ర కుమార్, సుంకర బుజ్జి,గెద్దాడ శ్రీను సుంకర శ్రీనుబాబు, కొల్లు శ్రీను, స్థానిక మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Scroll to Top