జనసేన అంటేనే జనాల కోసం..
ముమ్మరంగా బీసీ జనసేన కమిటీల నియమాలు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు గా ఎల్పాటి రాజ్ కుమార్ ఎన్నిక.
వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గా కలేతి మదన్ కుమార్ నియామకం.
హాజరైన జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప.
( పయనించే సూర్యుడు జనవరి 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
గ్రామాల్లో బీసీలకు ఉన్న సమస్యలు,అవసరరాలు గుర్తించి పరిష్కారం చూపడమే బీసీ జనసేన ముందడుగు వేస్తుందని వెల్లడించారు జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప…బుధవారం పట్టణంలో నియోజకవర్గం అధ్యక్షులు జక్కుల జలజ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాద్ జిల్లాలకు సంబందించిన అధ్యక్షులను నియమించారు.ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు చంద్రశేఖర్ అప్ప,జిల్లా మహిళా అధ్యక్షులు కాటం భాగ్యలక్ష్మి గౌడ్,జిల్లా అధ్యక్షులు గా బోయ చెన్నయ్య,గౌరవ అధ్యక్షులు మేకల వెంకటేష్ ముదిరాజ్,గద్దమిది రమేష్ హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ,,, గ్రామాలు,మండలాలు,నియోజకవర్గాల వారీగా బీసీ జనసేన కమిటీలకు శ్రీకారం చుట్టడమే మా అంతిమ లక్ష్యం అన్నారు.ముఖ్యంగా పాఠశాలలో,హాస్టల్లల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు,ఇబ్బందులను పరిష్కారం చూపి వారికి అవగాహనా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.బీసీ జనసేన అంటేనే జనాల కోసం అనేలా ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీసీ జనసేన అధికార ప్రతినిధి జక్కుల స్రవంతి ముదిరాజ్,టౌన్ అధ్యక్షులు రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి సుకన్య చారి,శ్రీధర్ వర్మ ముదిరాజ్, సోషల్ మీడియా కన్వీనర్ SB బాలు తదితరులు పాల్గొన్నారు…
